కామారెడ్డి, 2026-08-15
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆగస్టు 15, 2026, శనివారం నాడు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సలహాదారులు వి. హనుమంతరావు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆగస్టు 15, 2026, శనివారం నాడు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సలహాదారులు వి. హనుమంతరావు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అధికారుల ప్రసంగం, శాఖల ప్రగతి నివేదిక
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక, అటవీ, విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్ వంటి శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించారు.

