Jangaon/Ghanpur (Station) (డాక్సిన్ టైమ్స్) జూన్ 28
జూలై 02న రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పాల్గొనే బహిరంగ సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ పర్యటనలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పాల్గొననున్న బహిరంగ సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ అధ్యక్షతన తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జూలై 02న రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి సమీపంలో ఈ సభ జరగనుంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలో సమీక్షిస్తూ, వీవీఐపీల పర్యటన దృష్ట్యా ఎటువంటి భద్రతా లోపాలకు తావులేకుండా సెక్యూరిటీ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతూనే సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.












