వరుసగా రెండు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విఫలమవ్వడంతో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన ప్రయోగ కార్యకలాపాలకు మూడు నెలల పాటు విరామం ప్రకటించింది. ఈ నిర్ణయం గగన్‌యాన్, చంద్రయాన్-4 వంటి భవిష్యత్ ప్రయోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
గత ఏడాది మేలో పీఎస్ఎల్వీ సీ61, ఈ ఏడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ల ప్రయోగాలు సాంకేతిక లోపాల కారణంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యాలకు మూడో దశలోని ఘన ఇంధన మోటార్లలో తలెత్తిన సమస్యలే కారణమని ఇస్రో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నిర్ధారించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సాంకేతిక లోపాలపై షార్ కేంద్రంలో ఇంజినీర్లతో విచారణ చేపట్టిన కమిటీ, దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో సెంటర్లలోనూ తనిఖీలు నిర్వహించింది. లోపాల మూలాలను గుర్తించి, వాటిని సరిదిద్దే చర్యలపై దృష్టి సారించింది.










