ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం: ఐవిఎఫ్, రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన ఫార్మా కౌన్సిల్ బోర్డులో, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిని కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన ఫార్మా కౌన్సిల్ బోర్డులో, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిని కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, రక్తదాన శిబిరాలను నిర్వహించడంతో పాటు ఆధ్యాత్మిక, అన్నదాన కార్యక్రమాలకు చేయూతనిస్తూ, సామాజిక బాధ్యత కలిగిన చిలువేరి మారుతికి తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునిగా అవకాశం రావడం అభినందనీయమని, వారిని సన్మానించారు.









