పాటించాలని (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 08
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సూచించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 397 కేసులు నమోదు చేసి, రూ. 85,360 జరిమానా విధించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రమాదాలను నివారించండి: ఎస్పీ ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి – కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరి..జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సూచన. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు జిల్లా ఎస్.పి. శషెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సూచించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 397 కేసులు నమోదు చేసి, రూ. 85,360 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్.పి. తెలిపారు. వాహనదారులకు పోలీసుల సూచనలు: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. కార్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్‌బెల్ట్ ధరించాలి. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం – ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించకూడదు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదు. అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించవద్దని ఎస్.పి. సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి నిబంధనల ఉల్లంఘనపై చట్ట ప్రకారం చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.





