ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలం సిరాజుపల్లి గ్రామంలో ఎండిపోయిన చీనీ తోటలను ఆయన పరిశీలించారు.
జిల్లాలో తగినంత వర్షపాతం నమోదు కాక పంటల సాగు జరగలేదని, ఇప్పటికే కరువు ఛాయలు అలుముకున్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తక్షణమే ప్రభుత్వం కరువు బృందాలను పంపి అంచనా వేయాలని, కేంద్రానికి సమగ్ర కరువు నివేదిక పంపి అత్యవసర ఆర్థిక సహాయం కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ గణాంకాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా నివేదిక రూపొందించి, కరువు ప్రభావిత మండలాలను ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.












