మండలం టక్కోలి గ్రామ పంచాయతీ పరిధిలోని సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, సేంద్రియ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేసేందుకు వర్మీ పిట్స్‌లో వానపాములను వేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాజంపేట టీడీపీ ఇన్చార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరడంతో పాటు రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.












