ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కామారెడ్డి జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు అవగాహన జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం విడుదల చేసింది. ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం చూపనున్న నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతన్నా... ముందుచూపే మన బలం అనే నినాదంతో, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం రూపొందించి విడుదల చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ అవగాహన గ్రామ, మండల స్థాయిలోని అన్ని అధికారిక వాట్సాప్ గ్రూపులతో పాటు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఈ ముఖ్యమైన సమాచారం చేరేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు.












