దుద్యాల
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు రూ.9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొంటారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు రూ.9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొంటారు.
మొదటి రోజు (శనివారం) ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా మండలం హకీంపేట చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు హకీంపేటలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రదర్శన స్టాళ్లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి బయలుదేరి రాత్రి అక్కడే బస చేస్తారు.

