రైతులే దేశానికి అత్యంత బలమైన మూలస్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (-) పథకం 24వ విడత నిధులను గుజరాత్‌లోని బనస్కాంత నుంచి ప్రధాని మోదీ విడుదల చేశారు.
ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ.18,680 కోట్లకు పైగా నిధులు నేరుగా బదిలీ అయ్యాయి. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన భూమి కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, ఒక్కో విడతకు రూ.2,000 చొప్పున ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ఖర్చులను కొంతవరకు భరించేందుకు ఆర్థిక సహాయం లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ( ) కింద ఏర్పాటు చేసిన 521 యూనిట్లను జాతికి అంకితం చేశారు. అలాగే అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు 12 హార్టికల్చర్ క్లస్టర్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచడం, పంటల నష్టాన్ని తగ్గించడం, రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2020లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి 23 విడతల్లోనే రైతులకు రూ.4.47 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు కేంద్ర ప్రభుత్వ సమాచారం వెల్లడించింది. తాజా 24వ విడతతో మరింత మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.







