వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులే మార్కెట్ ఫీజు , రైతుల నుంచి వసూలు చేయరాదని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య స్పష్టం చేశారు. జిల్లాలోని 10 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రైతులు తమ పంటలను బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా విక్రయించుకోవచ్చని ఆమె తెలిపారు.
తెలంగాణలో పండిన వ్యవసాయ ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడంతో వివిధ ప్రాంతాల వ్యాపారులు రైతుల నుంచి నేరుగా, మధ్యవర్తుల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని రమ్య తెలిపారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల విలువపై ఒక శాతం మార్కెట్ ఫీజును కొనుగోలు చేసే వ్యాపారులే సంబంధిత మార్కెట్ కమిటీలకు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైతులకు తప్పుడు సమాచారం వద్దు
కొంతమంది మధ్యవర్తులు, దళారులు మార్కెట్ ఫీజు విషయంలో రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ అపోహలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కనీస మద్దతు ధర ఆధారంగానే మార్కెట్ ఫీజు చెల్లిస్తామంటూ తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగడం సరికాదని ఆమె అన్నారు. రైతులు దళారులు, మధ్యవర్తులు చెప్పే అవాస్తవాలను నమ్మవద్దని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

