విమాన ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఒక శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కార్డ్, పలు ట్రావెల్ పోర్టల్స్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
విమాన టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ప్రయాణానికి వెనకడుగు వేస్తుంటారు. అయితే, సరైన ప్రణాళిక, క్రెడిట్ కార్డుల వినియోగంతో ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం, బీఓబీ కార్డ్ (BOBCARD) ద్వారా ప్రయాణికులకు ప్రత్యేకమైన ట్రావెల్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఆఫర్లు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తిస్తాయి. ఎయిరిండియా, మెక్మైట్రిప్, ఈజీమైట్రిప్, గోఐబీబో, పేటీఎం ట్రావెల్, యాత్రా, ఇక్సిగో, మరియు ఉద్ చలో వంటి ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలలో టికెట్ బుకింగ్‌లపై తగ్గింపులు పొందవచ్చు.












