దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ సూచించారు. పండుగ సంబరాల్లో మునిగిపోయి భద్రతా జాగ్రత్తలను మరవద్దని, ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దసరా సందర్భంగా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇళ్లలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వీలైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇచ్చి, ఇంటి పరిసరాలను గమనించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇంటి భద్రతకు చర్యలు












