దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు బుధవారం స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెంది నిల్వలు చేసుకోవద్దని ప్రజలకు సూచించాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థలు దేశంలో ఇంధన సరఫరా యధావిధిగా కొనసాగుతోందని, నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపాయి. తమ అవుట్లెట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలలో కొన్ని అంతరాయాలు ఏర్పడినప్పటికీ, భారతదేశం వైవిధ్యభరితమైన వనరుల ద్వారా సరఫరాలను సజావుగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. ముడి చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.










