ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ధర్మపాల్ సత్యపాల్ గ్రూప్ ( )కు చెందిన క్యాచ్ () బ్రాండ్, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను సులభంగా వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలోనే తొలిసారిగా స్క్వీజీ బాటిల్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తి ప్రచారం కోసం , అనే నినాదంతో కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన ()ను విడుదల చేసింది.
వంట చేసేటప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం, నిల్వ చేయడం వంటి ఇబ్బందులను తగ్గించడమే ఈ కొత్త ప్యాకేజింగ్ లక్ష్యం. సాధారణ బాటిల్ లేదా గిన్నె నుంచి పేస్ట్ తీసుకునే బదులు, స్క్వీజ్ చేయడం ద్వారా అవసరమైనంత పేస్ట్‌ను నేరుగా వంటలోకి వేసుకోవచ్చు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రూపొందించిన ఈ ప్రకటనలో, ఓ ఉద్యోగిని ఉదయం వంట చేస్తూ, మరోవైపు మీటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు చూపించారు. ఫ్రిజ్‌లో నుంచి ఇంట్లో తయారు చేసిన అల్లం-వెల్లుల్లి పేస్ట్ గిన్నెను తీస్తుండగా అది జారి నేలపై పడింది. మళ్లీ అల్లం, వెల్లుల్లి ఒలిచి, తరగి, రుబ్బుకోవాల్సి వస్తుందని ఆమె ఆందోళన చెందింది. ఇంతలో క్యాచ్ కొత్త స్క్వీజీ బాటిల్ పరిచయమైంది. దీంతో తక్కువ సమయంలో వంటను పూర్తి చేసుకునే వీలును ప్రకటన వివరిస్తుంది.












