
వైయస్ఆర్ కడప జిల్లా మండలం ఇసుకపల్లి రోడ్డులోని పంచముఖ విష్ణు గణపతి ఆలయంవినాయక చవితి ఉత్సవాల్భాగంగా బుధవారం పంచముఖ విష్ణు గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యతరలివచ్చారు.

కడప జిల్లా, మండలం పరిధిలోని మంగంపేట చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నెల బుధవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు 31వ విడతగా రూ.35,24,537 విలువైన చెక్కులను అందజేశారు.

ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పార్టీ క్యాడర్ తో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదని, వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. వినియోగదారుల ఇష్ట ప్రకారమే చెల్లింపు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

కడప నగరంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్లాస్టిక్ కవర్లలోని హానికర రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

కడప నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ ఖరారైతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కూకట్లపల్లి బాబు (కే. బాబు) పేరు ప్రముఖంగా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం పట్టణంలో పర్యటించి, గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లి రవి (45) అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్లారెడ్డి బస్టాండ్ ఆవరణలో గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించవద్దని, మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని అవగాహన కల్పించారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పోలీసులు వినూత్న ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందిరాచౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్‌ను వినాయక మండపంగా మార్చి, ట్రాఫిక్ వినాయకుడును ఏర్పాటు చేశారు. భక్తి మార్గంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నిమజ్జన రూట్‌తో పాటు, నిమజ్జనం జరిగే పెద్ద చెరువు వద్ద చేపట్టిన చర్యలను ఆర్డీవో, డిఎస్పి శ్రీనివాస్, సీఐ, మున్సిపల్ కమిషనర్, ఎలక్ట్రికల్ ఏఈ, ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి సమీక్షించారు.

ఢుల్లీలో జాతీయ వుశేష వాగ్దేవు ప్రతుభా, పరస్ార గ్రహీత, రచయిత, బొల్ల రామ్మోహన్ మంగళవారం పోరమాముళ్లలోను ఆయన స్వగృహంలో జుల్లా రచయితల ఘనంగా సన్మానించారు. డప జుల్లా సాహుత్య ార్య్రమాలలో ఆయన వుస్తృత భాగస్వామ్యాను గాన ఈ పరస్ారం లభించుంది

కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో సోమవారం ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, ఆమెపై రేజర్ బ్లేడుతో దాడి చేసి మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయాడు. ఈ ఘటన కలకలం రేపింది.

కడప జిల్లాలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల ఈ తనిఖీలు చేపట్టారు. మండప నిర్వాహకులకు పలు భద్రతా సూచనలు జారీ చేశారు.

జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

కౌలుకు తీసుకున్న భూమికి డబ్బులు అడిగినందుకు 75 ఏళ్ల వృద్ధుడిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి అన్నమయ్య జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు పటిష్టమైన సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేయడంతో ఈ శిక్ష పడింది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా, రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9 గంటలకు కర్షక్ బి.ఎడ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.

మదనపల్లెలో భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు పడింది. చిత్తూరు మహిళా ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పడపట్ల రఘుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.