జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత వంటి అంశాలపై విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, తడ జెడ్పీ హైస్కూల్లో తడ ఎస్ఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలతో పాటు, సామాజిక గౌరవం మరియు భవిష్యత్ జీవితంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అలాగే, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన చట్టపరమైన చర్యలు, శిక్షలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, రోడ్డు భద్రతా నిబంధనలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.












