భీంగల్ పట్టణంలో చాయ్ హోటల్ నడుపుతున్న పొలాస సుధాకర్ అనే వ్యక్తి, పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది.
పోలీసులు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సుధాకర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భీంగల్ పట్టణానికి చెందిన పొలాస సుధాకర్ స్థానికంగా చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో సుధాకర్ పై పోలీసులు అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచుతున్నారని కేసు నమోదు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్‌కు రావాలని సమాచారం అందింది. సోమవారం భీమ్ గల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సుధాకర్‌కు, కేసు విషయం కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన సుధాకర్, తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను పోలీస్ స్టేషన్ ఆవరణలో పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది. స్థానికులు మంటలను ఆర్పేసి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన సుధాకర్‌ను మొదట జిజిహెచ్ నిజామాబాద్‌కు, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో, స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడితో పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని సుధాకర్ తన ఆత్మహత్యకు కారణమని తెలిపారు. అయితే, ఆసుపత్రిలో సుధాకర్ మరో విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో, ఈ కేసులో పోలీసుల వేధింపులు కారణం కాదని సీపీ ప్రకటన జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం, పోలీసుల వేధింపులే సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించారు. ఇందుకు ఎస్ఐ తిరుపతిపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం భీంగల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భీంగల్ లో బంద్ ప్రశాంతంగా విజయవంతంగా సాగుతోంది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి, సుధాకర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన చాయ్‌వాలా సుధాకర్‌కు నివాళులర్పించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని, హైదరాబాద్‌లోని తన నివాసంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.











