నేర విచారణలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన బీఎన్ఎస్ చట్టం 2023లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను కేటాయించింది. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లాకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వాహనాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు.
ఇటీవల రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 26 మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడి వాహనాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాన్ క్యాడర్ ఎస్పీ ఎస్.ఆర్ రాజశేఖర్ రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో కలిసి వాహనంలోని శాస్త్రీయ పరికరాలు, వాటి పనిచేసే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వాహనంలో సైంటిఫిక్ ఎక్విప్మెంట్, ఎల్సీడీ స్క్రీన్లు, క్రైమ్ సీన్ వద్ద భౌతిక సాక్ష్యాలను సేకరించడానికి అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.












