40 ఏళ్ల క్రితం కొనుగోలు న తమ ప్లాట్ను కొందరు ఆక్రమించుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళ ఆశాభాను, అష్రఫ్ బుధవారం జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యలను వివరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు నా న్యాయం జరగలేదని వాపోయారు.
బాధితురాలు ఆశాభాను 40 సంవత్సరాల క్రితం స్థానిక సీనియర్ సిటిజన్ విద్యానగర్ కాలనీలో ముప్పారపు వెంకయ్య వద్ద సుమారు 290 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. అయితే, ఈ స్థలంలో 90 చదరపు గజాలను గతంలో విక్రయించగా, మిగిలిన 200 గజాలను 2008లో రవికిరణ్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. అక్కడికి వెళ్ళగానే ప్లాట్ కబ్జా బోర్డు పాతివేశారని వారు పేర్కొన్నారు. ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ పలకలను ఏర్పాటు చేస్తున్న విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే నిర్మాణాన్ని ఆపివేయించారు. ఈ విషయమై అప్పట్లో కోర్టును ఆశ్రయించగా, 2018లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వారు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం, మున్సిపాలిటీ నుంచి ఇల్లు నిర్మాణానికి అనుమతి కూడా తీసుకున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అయితే, గత మూడు రోజుల క్రితం తమ స్థలంలో రవికిరణ్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు ఫెన్సింగ్ చేయడానికి రావడంతో అక్కడికి వెళ్ళగా, వారు తమ స్థలంలోనే బోర్డు పాతి తమదేనని చెప్పారని బాధితులు తెలిపారు. తాము ఆ బోర్డును తొలగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు బెదిరించారు. జరిగిన విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్లతో సహా చూపించి న్యాయం చేయాలని కోరినా, మూడు రోజులుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. దీంతో బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ, పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.











