ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులను ఒక దళిత నాయకుడు లక్ష్యంగా చేసుకున్నాడు. సమస్యల పరిష్కారం పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి, మోసం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బాధితుల్లో దళితులతో పాటు బీసీలు కూడా ఉన్నారని తెలిసింది.
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో కొన్ని భూ సమస్యలు మరియు ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు, ఆర్మూర్ లోని ఒక దళిత నాయకుడిని సంప్రదించారు. ఆ నాయకుడు ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తానని చెప్పి, భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మోసపోయిన వారిలో దళితులతో పాటు బీసీలు కూడా ఉన్నారని గమనించాలి. కొంతమంది వ్యక్తులు తమ పని జరగలేదని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, వారిని బెదిరించినట్లు కూడా తెలిసింది. బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











