కడప జిల్లాలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల ఈ తనిఖీలు చేపట్టారు. మండప నిర్వాహకులకు పలు భద్రతా సూచనలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు వినాయక మండపాలను విస్తృతంగా తనిఖీ చేశారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాల వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా, మండప నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత పాటించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.












