కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో సోమవారం ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, ఆమెపై రేజర్ బ్లేడుతో దాడి చేసి మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయాడు. ఈ ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, విద్యానగర్ కాలనీకి చెందిన జొన్నాల సునీత (32) తన ఇంట్లో భోజనం చేస్తుండగా, ఓ అపరిచిత వ్యక్తి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించాడు. సునీతను అడ్డుకోబోగా, ఆ వ్యక్తి ఆమెపై రేజర్ బ్లేడుతో దాడి చేశాడు. దీంతో ఆమె పెదవిపై రక్తపు గాయమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆమెను చంపుతానని బెదిరించి, మెడలో ఉన్న సుమారు మూడు తులాల బరువైన బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు. అపహరించిన పుస్తెలతాడు విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.












