మదనపల్లెలో భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు పడింది. చిత్తూరు మహిళా ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పడపట్ల రఘుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
మదనపల్లె చిలకవారిపల్లెకు చెందిన పడపట్ల రఘు, గత ఏడాది సీటీఎం రోడ్డులోని బాపూజీ పార్క్ వద్ద తన భార్య లక్ష్మీదేవమ్మను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. హత్య అనంతరం మదనపల్లె టూ-టౌన్ పోలీసులు 147/2023 నంబర్‌తో కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి. హరిత సమక్షంలో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి, భారతీయ శిక్షాస్మృతి () సెక్షన్ 302 కింద నిందితుడు పడపట్ల రఘుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











