కడప, 15 September
ట్రాఫిక్ జామ్‌పై మాటామాటా.. యువకుడిపై కర్రలతో దాడి
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ట్రాఫిక్ జామ్‌పై మాటామాటా.. యువకుడిపై కర్రలతో దాడి! తీవ్రంగా గాయపడిన ధనుష్.. తిరుపతికి తరలింపు..
డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ దక్షిణ్ టైమ్స్ . కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని గౌరమ్మకట్ట వీధిలో సోమవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ధనుష్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ధనుష్ కంటికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం అతడిని తిరుపతికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. వినాయక విగ్రహం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కొంచెం సేపు ఆగి వెళ్లాలని ధనుష్ కారులో ఉన్న వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు ధనుష్‌తో వాగ్వాదానికి దిగి, అనంతరం కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వాటిని పరిశీలిస్తున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులు ఇప్పటివరకు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని సమాచారం.












