కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమం సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా రహదారుల పరిశుభ్రత, వీధి దీపాల అమరిక, తాగునీటి సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారు SI లు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని చైర్పర్సన్ సూచించారు.











