తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
అంబేద్కర్ యూత్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నందిపై ఆసీనుడైన గణనాథుడు దర్శనమిచ్చారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరిగాయి. భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమారు 500 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద దాత బరుపతి వెంకన్న ఉపేంద్ర, బరుపతి శ్రీను, శ్రీకాంత్ కుటుంబ సమేతంగా అన్నదానం చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆకస్మికంగా కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ యూత్ క్లబ్ హరిపిరాల తలారి కాలనీ అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి మధువన్, కోశాధికారులు నరేష్, చంటి, మురళి, ఉపాధ్యక్షులు సాయికుమార్, వెంకటేష్, యూత్ కార్యవర్గ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.












