మండలం గర్గుల్ గ్రామంలోని అవతార్ మెహెర్‌బాబా ఆలయ 34వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు.
ఉదయం ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ధుని, సప్తస్వర పతాకావిష్కరణ చేపట్టారు. ఉదయం 8.30 గంటలకు మెహెర్‌బాబా పల్లకీ సేవను గ్రామంలో నిర్వహించారు. వివిధ మెహెర్‌బాబా కేంద్రాల నుంచి వచ్చిన భక్తులు భజనలు, ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు












