కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న ఉరుసు మహోత్సవాలను భక్తి భావంతో పాటు పర్యాటక వైభవాన్ని ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించాలని, దీని ద్వారా జిల్లా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేయాలని డిఆర్వో కె. మల్లికార్జునుడు సంబంధిత అధికారులను, ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న ఈ మహోత్సవాల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం జరిగింది.
కడప ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేసేలా, అమీన్ పీర్ దర్గా మహోత్సవాలను భక్తి భావం, పర్యాటక వైభవాన్ని ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో చేపట్టాలని డిఆర్వో కె. మల్లికార్జునుడు దర్గా ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ లో అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్వో కె. మల్లికార్జునుడు అధ్యక్షతన ఊరుసు ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిఆర్వో తోపాటు ఏఎస్పీ ప్రకాశ్ బాబు, కడప ఆర్డీవో మురళి, నగర కమీషనర్ భవానీ ప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి హిదాయతుల్లా హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘనంగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు












