తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాల కోసం పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్వో కె.వి. మురళీకృష్ణలు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మరియు ఇతర సౌకర్యాల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్. లు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన ఈరోజు ఉదయం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా పోలీసు అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరియు సంబంధిత సిబ్బందితో కలిసి శ్రీవారి ఆలయం పరిసరాలు, నాలుగు మాడ వీధులు, భక్తుల గ్యాలరీలు, ఔటర్ రింగ్ రోడ్, అలిపిరి టోల్గేట్ తదితర కీలక ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల కదలికలు, రద్దీ నియంత్రణ, పార్కింగ్ సామర్థ్యం, భద్రతా పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.












