మండల కేంద్రంలోని చారిత్రాత్మక మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనుల్లో భాగంగా, దేవదాయ శాఖ అధికారులు గురువారం ఆలయాన్ని సందర్శించారు. పునర్నిర్మాణానికి అవసరమైన ఎస్టిమేట్ కోసం విగ్రహాలు, పరిసరాల కొలతలు తీసుకున్నారు.
వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక శోభను పంచుతున్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇది మొదటి మెట్టుగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ ఏఈ రమేష్, స్తపతి వెంకటేష్ ఆలయాన్ని సందర్శించి, పనుల అంచనాకు అవసరమైన వివరాలను సేకరించారు. ఎస్టిమేట్ కు అనుగుణంగా అవసరమైన డిపాజిట్లను తక్షణమే చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ సందర్శనలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంద వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్, కార్యదర్శి మేక నాగేష్ తో పాటు సంఘం సభ్యులు గంగాధర్, కిషన్, భూమేష్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











