దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా, తిరుమలకు తొలిగడపగా పేరొందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ సేవ వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై శ్రీవారు మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గురువారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ, భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగారు. భక్తులు అడుగడుగునా హారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. గరుడ సేవను దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.












