తిరుపతిలో ప్రస్తుతానికి నీటి సరఫరాపై ఎలాంటి సమస్యలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అన్ని జలాశయాల్లో మార్చి, ఏప్రిల్ నెలల అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పాపవినాశనం జలాశయంలో 4 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉందని వెల్లడించారు. వర్షాలు కురిస్తే జలాశయాల్లోని నీరు ఏడాదిన్నర పాటు సరిపోతుందని, భద్రత కోసం పలు సర్వేలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేశామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తిరుమలలో భక్తులకు, స్థానికులకు తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జలాశయాల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ముందస్తు ప్రణాళికలతో నీటి సరఫరాను నిర్వహిస్తున్నామని చెప్పారు.
భక్తుల రద్దీ పెరిగినా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చైర్మన్ భరోసా ఇచ్చారు. జలాశయాల పటిష్టతకు అవసరమైన మరమ్మతులు, భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







