జనగాం, 15 September
వినాయక చవితి పండుగ సందర్భంగా కడప నగరంలోని గణేష్ మండపాలను మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాష సందర్శించారు. ఆయనతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పలు వినాయక మండపాల్లో మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ భాష ప్రత్యేక పూజలు: డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప దక్షిణ్ టైమ్స్ : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కడప నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాష సందర్శించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు , మాజీ మేయర్ కె. సురేష్ బాబు, ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, సీనియర్ నాయకులు సుభాన్ భాష, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్ లతో కలిసి ఆయన గురువారం నగరంలోని ఎన్జీవో కాలనీ, కోఆపరేటివ్ కాలనీ, గడ్డి బజార్, మాసాపేట తదితర ప్రాంతాల్లోని గణేష్ మండపాలను దర్శించారు. ఈ సందర్భంగా అంజాద్ భాష మాట్లాడుతూ... విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కడప నగర ప్రజలకు, వైఎస్సార్ జిల్లా వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున, కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటా కృష్ణ, జిల్లా కార్యదర్శి తక్కోలి రమేష్ రెడ్డి, ఈస్ట్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షిండే రవి చంద్ర రావు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాబు, నగర వాలంటీర్ వింగ్ అధ్యక్షుడు బండారు వంశీ, పార్టీ నాయకులు సాయి మహేష్, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












