తాడ్వాయి, 14 September
కామారెడ్డి జిల్లా మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిహర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ఎన్నారై ఏనుగు సంజీవరెడ్డి అమెరికాలో స్థిరపడినా స్వగ్రామం, పరిసర ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి ఆరు ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సేవే లక్ష్యం.. సొంత ఊరిపై మమకారం! కామారెడ్డి జిల్లా: మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిహర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ఎన్నారై ఏనుగు సంజీవరెడ్డి అమెరికాలో స్థిరపడినా స్వగ్రామం, పరిసర ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి ఆరు ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా అందించారు. గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ చేపట్టారు. వృద్ధులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పేద కుటుంబానికి చెందిన విద్యార్థినికి ఉన్నత విద్య కోసం చేయూతనిచ్చారు. గాంధారిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పలువురికి పరీక్షలు నిర్వహించి, సుమారుగా ఎనిమిది మందికి కంటి ఆపరేషన్లకు సహకారం అందించారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల కోసం కంప్యూటర్లను కూడా అందజేశారు. సంజీవరెడ్డి సేవలను గుర్తించిన విలేకరుల బృందం ఆయనను శాలువాతో సన్మానించింది. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరగా, భవిష్యత్తులోనూ ప్రజలకు అండగా నిలుస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిపోర్టర్లు ఐలేని రాజు, రాజ్‌కుమార్, సాయిబాబా, కరీముద్దీన్, వెంకట్రావు, సుధాకర్ పాల్గొన్నారు.












