ఫ్రంట్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 09
కడప నగరంలో ఉపాధి కోసం టీ బంకు నడుపుకుంటున్న ఓ జర్నలిస్టు స్టాల్‌ను కార్పొరేషన్ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఆర్ఎస్ఎఫ్ () రాష్ట్ర అధ్యక్షుడు డి.యం. ఓబులేసు యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడపలో జర్నలిస్టు టీ బంకు తొలగింపు దారుణం కడప నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్ సమీపంలో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న ఓ జర్నలిస్టు టీ బంకును ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు తొలగించడం తీవ్ర దుమారం రేపింది. అధికారుల తీరుపై ఆర్ఎస్ఎఫ్ (RSF) రాష్ట్ర అధ్యక్షుడు డి.యం. ఓబులేసు యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత జర్నలిస్ట్ దగ్గుపాటి శ్రీనివాసులు పత్రికారంగంలో పనిచేస్తూనే, కుటుంబ పోషణ కోసం రూ.2 లక్షలు అప్పు చేసి, కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొంది ఈ టీ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీస సమాచారం తెలపకుండా అధికారులు టీ కొట్టు రేకులను తొలగించి పక్కన పడేయడంపై స్థానిక నాయకులు, విలేకరులు తీవ్ర నిరసన తెలిపారు. ఘటనా స్థలాన్ని బీసీ యునైటెడ్ నేషనల్ జిల్లా అధ్యక్షుడు తిప్పిరెడ్డిపల్లి నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు చంద్ర, నరసయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ, నగరంలో కోట్ల విలువైన భూములను ఆక్రమించిన పెద్దలపై చర్యలు తీసుకోని అధికారులు, కష్టపడి జీవించే పేద జర్నలిస్టు కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్పొరేషనే స్వయంగా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి, మళ్లీ నోటీసు లేకుండా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందో కమిషనర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్పొరేషన్ అధికారులు స్పందించి బాధిత జర్నలిస్టుకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో అన్ని పక్షాలను కలుపుకొని నగర కార్పొరేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.












