కామారెడ్డి, 9 September
తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కాళోజీ జిల్లా పోలీసుల ఘన నివాళి కాళోజీ ఆశయాలతో ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల సమస్యలను సమాజం దృష్టికి తీసుకువచ్చి, ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన సాహిత్యం అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించిందని పేర్కొన్నారు. కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, ఆర్ఐలు కృష్ణ, సంతోష్ కుమార్, నవీన్, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.












