కామారెడ్డి, 4 September
జిల్లా లింగంపేటలో మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం చేసుకుని, తన ముగ్గురు పిల్లలతో సహా వెళ్లిపోయిన ఒక వ్యక్తిని పోలీసులు సకాలంలో గుర్తించి, వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో పోలీసుల సమయస్ఫూర్తి ప్రశంసనీయమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆపదలో కుటుంబాన్ని కాపాడిన పోలీసుల సమయస్ఫూర్తి జిల్లా లింగంపేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. కమ్మర్పల్లి నివాసి, ప్రస్తుతం లింగంపేటలో పాత ఇనుప సామాను వ్యాపారం చేస్తున్న చిత్తారి రాజు మద్యం మత్తులో భార్యతో గొడవపడి, తన ముగ్గురు చిన్నారులతో కలిసి టాటా ఏస్ వాహనంలో “చనిపోతాను” అంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న లింగంపేట బ్లూకోట్స్ సిబ్బంది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR)కు సమాచారం అందించగా, సదాశివనగర్ పెట్రోలింగ్ ASI జగదీష్ నేతృత్వంలో గాలింపు చేపట్టి వాహనాన్ని గుర్తించి నిలిపివేశారు. అనంతరం లింగంపేట పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి రాజుకు కౌన్సెలింగ్ నిర్వహించి, పిల్లలతో సహా సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్లూకోట్స్, PCR, పెట్రోలింగ్ సిబ్బంది సమన్వయం, సమయస్ఫూర్తితో నలుగురి ప్రాణాలు కాపాడబడటంపై జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, IPS ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని, అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.












