కామారెడ్డి, 9 September
ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్యం ప్రజల జీవన విధానానికి, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిందని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కాళోజీ సాహిత్యం సమాజానికి స్ఫూర్తి: అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్యం ప్రజల జీవన విధానానికి, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిందని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల సమస్యలకు బలమైన స్వరం అందించారని, తెలంగాణలో సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన పోరాటం, ఆయన సాహిత్య సేవలు చిరస్మరణీయమని అన్నారు. కాళోజీ రచనల్లో సామాన్య ప్రజల జీవితం, వారి సమస్యలు, ఆకాంక్షలు ప్రతిబింబించాయని, సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించిన మహనీయుడిగా ఆయన నిలిచారని కొనియాడారు. కాళోజీ సాహిత్య స్ఫూర్తిని యువత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ప్రజల కోసం నిరంతరం గొంతెత్తిన ప్రజాకవిగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పాండు, డీఎంహెచ్ఓ వెంకటేష్, ఆర్డీఓ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సాపా శివరాములు, కొంగర వెంకటి, నాగభూషణం, ఎంబీసీ నాయకులు శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.












