కామారెడ్డి, 14 September
జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా తొలిరోజు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో తొలిరోజు వినాయక చవితి పూజలు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టరేట్లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా తొలిరోజు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, టీజీవో జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజశేఖర్, రాజ్‌కుమార్, ఎల్లారెడ్డి, మెట్టు రవీందర్, సుమన్‌కుమార్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.












