2026 విశ్వావసు నామ సంవత్సరం తులా రాశి వారికి గోచార రీత్యా అత్యంత అనుకూలమైనదిగా, అభివృద్ధిదాయకమైనదిగా ఉండబోతోందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రాశి అధిపతి శుక్రుడు, గురు గ్రహ ప్రభావం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.
ఆర్థికంగా, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధనం లభించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వాహనం లేదా గృహం కొనుగోలు యోగం ఉంది. శుభకార్యాలు, విలాసవంతమైన జీవనశైలికి ఖర్చులు ఉన్నప్పటికీ, ఆదాయం బాగుండటం వల్ల ఇబ్బందులు ఉండవు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వృత్తిపరంగా, ఉద్యోగస్థులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. పదోన్నతి, వేతన పెంపునకు అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది స్వర్ణయుగం.










