కామారెడ్డి, 3 September
ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ లహరి గోనె, కౌన్సిలర్ తిరుమల సుమన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జై భారత్, ప్రెస్ మిత్రులకు నమస్కారం🙏 *శ్రీ భాషిత పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు* ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు క్షత్రియ ఫంక్షన్ హాల్లో గురువారం రోజు భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ లహరి గోనె గారు, 29వ వార్డ్ కౌన్సిలర్ తిరుమల సుమన్ గారు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా శ్రీ కృష్ణుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల కృష్ణవేషాలు, రాధా వేషాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు శ్రీకృష్ణుని బాల్య ఘట్టాలను ప్రతిబింబించేలా ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణుడి లీలలను ప్రతిబింబించే విద్యార్థుల నృత్యాలు, పాటలు అందరినీ అలరించాయి. జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి, ఆటపాటల మధ్య ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నించారు. చిన్నారుల కేరింతలు, చప్పట్లతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. శ్రీ కృష్ణుడి బాల్యంలోని ఉట్టి కొట్టే ఘట్టాన్ని గుర్తుచేసేలా నిర్వహించిన ఈ కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయవచ్చని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. అంతేకాకుండాక జన్మాష్టమి వంటి పండుగలను విద్యార్థులతో కలిసి నిర్వహించడం ద్వారా వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, డైరెక్టర్ కమల గారు, ప్రిన్సిపల్స్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.












