కామారెడ్డి, జూలై 29
సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామాలకు చెందిన అనాథ బాలబాలికలకు యూత్ ఫర్ సేవ, ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) ఆధ్వర్యంలో విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అనాథ చిన్నారులకు అండగా యూత్ ఫర్ సేవ – ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు లేని బాలబాలికలకు బుధవారం విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, జ్యామెట్రీ బాక్స్‌లు, డ్రాయింగ్ బుక్స్ అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన, అనాథ చిన్నారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్కల్ సర్పంచ్ ప్రియాంక సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. అవసరమైన విద్యా సామగ్రిని అందించిన యూత్ ఫర్ సేవ, సామాజిక సమరసత వేదిక, ఐ.ఎస్.ఆర్.డి సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.











