కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు శ్రీమతి భవాని బొంపెల్లి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు2026కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమె పాఠశాలను సందర్శించి ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాకు గర్వకారణమైన ఘనత దక్కింది. గాంధారి మండలంలోని ఎంపీపీఎస్ గర్ల్స్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న శ్రీమతి భవాని బొంపెల్లి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు2026కు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలిగా నిలిచి, జిల్లా ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో చాటిచెప్పారు.












