కామారెడ్డి, 2026-08-18
కామారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ () ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ () ఏర్పాటు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కూడా పాల్గొన్నారు.












