రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు మత్తు పదార్ధాల సరఫరాకు నిలయాలుగా మారుతున్నాయి. కడప, రాజంపేటతో పాటు పల్లె సీమల్లోనూ గంజాయి, సింథటిక్ డ్రగ్స్ ముప్పు విస్తరిస్తోంది. చాక్లెట్లు, సిగరెట్ల రూపంలో యువతను ఆకర్షిస్తూ డ్రగ్ పెడ్లర్లు విద్యాకుసుమాలను బలితీసుకుంటున్నారు.
ఒకప్పుడు బడా నగరాలకే పరిమితమైన ఈ డ్రగ్స్ ముప్పు, నేడు ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు పల్లె సీమలనూ కబళిస్తోంది. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రూపంలో చిరునవ్వుల బాట పట్టాల్సిన యవ్వనం.. చిమ్మచీకట్లోకి జారిపోతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తీవ్ర మానసిక ఒత్తిడి, చెడు స్నేహాలు, సోషల్ మీడియా వ్యామోహం యువతను ఈ ఊబిలోకి నెడుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు డ్రగ్ పెడ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. చాక్లెట్లు, సిగరెట్లు, తీపి పదార్థాల రూపంలో మత్తును ఎరగా వేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వేదికగా రహస్య కోడ్ భాషలో వ్యాపారం సాగిస్తూ విద్యాకుసుమాలను బలితీసుకుంటున్నారు.












