కామారెడ్డి, జూలై 28
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి "పక్షులు – పర్యావరణ స్పృహ" అంశంపై సైన్స్ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా "పక్షులు – పర్యావరణ స్పృహ" అంశంపై సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
మంగళవారం దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పర్యావరణ స్పృహను పెంపొందించుకుని ప్రకృతి, పక్షుల సంరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి మంచి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు.
సంఖ్యాశాస్త్రాన్ని నిత్య జీవితంలో అన్వయించుకునే విధంగా నేర్చుకోవాలని, పదో తరగతి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను సమర్థవంతంగా వినియోగించుకుని శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.











