రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వాల జాప్యం విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తోందని, ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శలు వస్తున్నాయి. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఒక సంఘటన ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు, ప్రభుత్వాల జాప్యానికి మధ్య సామాన్యుడి విద్యార్థుల కలలు కల్లలవుతున్నాయని అంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు చెల్లించలేని ఒక విద్యార్థిని బయటకు గెంటేసిన ఘటనపై విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై, ప్రభుత్వ పనితీరుపై విమర్శలకు దారితీసింది. 'ముగ్గురు పిల్లల ముచ్చట పక్కన పెట్టండి.. ఉన్న ఇద్దరి చదువుల సంగతి చూడండి' అంటూ ఒక తండ్రి వ్యక్తం చేసిన ఆవేదన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.











