ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులపై, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం చేసే పేద పిల్లలపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.
గరికపాటి మేధావి అయినప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కసుతో కూడుకున్నవని, అవి సరైనవి కావని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే చిన్నారులపై గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆ పిల్లలు పేదరికంలో ఉన్నారని, కడుపు నింపుకోవడానికే పాఠశాలలకు వస్తున్నారని, అలాంటి వారిని అవహేళన చేయడం సరికాదని నాగేశ్వరరావు అన్నారు. అన్నదానాన్ని మించిన దానం లేదని ధర్మశాస్త్రాలు చెబుతుంటే, దాన్ని తప్పు పట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.











