జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-1 పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక విద్యార్థి ఈ ఘనత సాధించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ లు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహీశ్వరి కూడా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వీరితో పాటు, నరేంద్రబాబు గారి మహిత్ OBC-NCL కేటగిరీలో, దేవా శ్రీవేద్ (ఆంధ్రప్రదేశ్) SC కేటగిరీలో 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఏడాది జనవరి 21 నుండి 29 వరకు జరిగిన సెషన్-1 పరీక్షలకు దాదాపు 13,04,653 మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఇది దాదాపు 96.26% హాజరును సూచిస్తుంది. రాష్ట్రాల వారీగా చూస్తే, రాజస్థాన్ నుంచి అత్యధికంగా ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు టాపర్లుగా నిలిచారు.











